ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వాహనదారులకు కౌన్సిలింగ్, నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానా
Ongole Urban, Prakasam | Jul 4, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో శనివారం పోలీసులు వాహనదారులకు పలు ప్రాంతాలలో కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాహనదారులకు జరిమానా విధించారు. హెల్మెట్ లేకపోవడం వాహన సంబంధిత ధ్రువపత్రాలు దగ్గర ఉంచుకోకపోవడం డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వంటి అంశాలను పోలీసులు వాహనదారులకు కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా జరిమానా విధించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదల నివారణకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు.