కర్నూలు: యూరియాను రైతులకు షరతులు లేకుండా పంపిణీ చేయాలి:కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఏ సూర్య ప్రకాష్ రెడ్డి
కర్నూలు జిల్లా రైతులకు యూరియాను షరతులు లేకుండా పంపిణీ చేయాలని కర్నూలు జిల్లా కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ ఏ సూర్య ప్రకాష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం 12 గంటలు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గల మహాత్మా గాంధీ గారి విగ్రహం ముందు రైతు సమస్యలపై సూర్య ప్రకాశ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న విషయం మరియు కొరతతో అల్లాడుతున్న రైతుల ఆవేదన గురించి రాష్ట్రంలో యూరియా కొరతవల్ల రైతులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా పంట నష్టపోయి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు సంభవించే వాతావరణానికి ఏర్పడిందన్నారు.