సత్యసాయి జిల్లా చిన్ని కొత్తపల్లి మండలం ప్యాదిండి గ్రామంలో అన్నదాత సుఖీభవ రెండో విడత చెక్కులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో ప్యాదిండి గ్రామంలో రైతులతో ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి రైతు సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతులతో సమావేశం నిర్వహించి రైతులు పండించిన పంట దిగుబడి వారి ఖర్చులు ఎంత ఆదాయం వస్తుంది ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందించాలని వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.