అల్లాదుర్గం: సీతానగర్ తండాలో వ్యక్తి అనుమానాస్పద మృతి, విచారణ చేపట్టిన పోలీసులు
Alladurg, Medak | Feb 14, 2025 మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం సీతానగర్ తండాలో శుక్రవారం ఉదయం వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెంది కనిపించాడు. మృతుడు కాయిదాం పల్లి గ్రామానికి చెందిన మల్లయ్యగా స్థానికులు గుర్తించారు. మల్లయ్య ను గుర్తు తెలియని దుండగులు హతమార్చి సీతా నగర్ తాండ లో మృతదేహాన్ని పడవేసినట్లుగా స్థానికులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉదయం 9 గంటల సమయంలో పోలీసులకు తాండవ వాసులు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలం వద్ద మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది