డోన్: డోన్ హజరత్ గోకారమయ్యే స్వామి గంధం ఉరుసు
Dhone, Nandyal | Jun 26, 2026 నంద్యాల జిల్లా డోన్ మండలం దొరపల్లిలో హజరత్ గోకారమయ్య స్వామి గంధం ఉరుసు ఉత్సవం శుక్రవారం నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటూ నగదు, పూలు, పండ్లు తదితర కానుకలను స్వామి వారికి సమర్పించారు. ఉత్సవ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.