హయత్నగర్ బస్టాండ్ సమీపంలోని నేషనల్ హైవే వద్ద ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. హెల్మెట్, నంబర్ ప్లేట్ సరిగ్గా లేకుండా వాహనాలు నడిపే వారికి చలాన్లు విధించారు. సరైన వాహనపత్రాలు, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో ఎస్సై బొలిశెట్టి శ్రీనివాస్, కానిస్టేబుల్స్ ఉన్నారు.