నంద్యాలలో విద్యుత్ కోతలపై ప్రజల ఆగ్రహం
Nandyal Urban, Nandyal | Apr 13, 2026
నంద్యాల నబీ నగర్ ఫాతిమా మస్జిద్ ప్రాంతంలో మూడు రోజులుగా రాత్రి వేళల్లో కరెంట్ కోతలు విధిస్తున్నారు. దీంతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ స్థానికులు ఆత్మకూరు బస్టాండ్ వద్ద గల విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులతో వాగ్వాదానికి దిగిన బాధితులు సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.