పాలకొల్లు: యలమంచిలి మండలం ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన ఇనుకొండ ధనలక్ష్మి
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం యలమంచిలి మండలం ఎంపీపీగా ఇనుకొండ ధనలక్ష్మి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, మాజీ జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జి గుడాల గోపి కుమారుడు గుడాల సాయి బాలాజీ, మాజీ యలమంచిలి మండలం వైస్సార్సీపీ అధ్యక్షులు పొత్తూరి బుచ్చి రాజు, యలమంచిలి మండలం వైస్సార్సీపీ అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్, పాలకొల్లు నియోజకవర్గ వైస్సార్సీపీ నాయకులు, యలమంచిలి మండలం వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.