నంద్యాల అర్బన్: ఆత్మకూరు బస్టాండ్ లో శ్రీశైలం వెళ్లే భక్తులకు కష్టాలు
Nandyal Urban, Nandyal | May 28, 2026
నంద్యాల జిల్లా ఆత్మకూరు బస్టాండ్ లో శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసీ బస్సుల కష్టాలు తప్పడం లేదు. వేసవి సెలవులు ముగిస్తుండడంతో ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి ఆత్మకూరు బస్టాండ్ కు శ్రీశైలంవెళ్లే ప్రయాణికులు, భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. అయితే ప్రయాణికులకు తగ్గ ఆర్టీసీ బస్సులు నడపడంలో ఆర్టీసీ అధికారులు విఫలమవుతున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్న బస్సులలోనే ప్రతి ఒక బస్సు 10 నుంచి 15 మంది ప్రయాణికులను అదనంగా ఎక్కించుకోవాలని అందువల్ల కొంత భారం తగ్గుతుందని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. అయితే నల్లమల అడవి ప్రాంతం ఘాట్ రోడ్డు కావడంతో సీట్ కెపాసిటీ వరకు మాత్రమే బస్స