చెన్నూరు: బావిలోకి దూకి వృద్ధురాలు ఆత్మహత్య
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని దీపక్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పిట్టల లక్ష్మి అనే గృహిణి బావిలో పడి మృతి చెందారు. జీవితంపై విరక్తితోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మృతురాలి భర్త పిట్టల లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో ఆయన నిద్రలేచి చూడగా తన భార్య లక్ష్మి మంచం మీద లేకపోవడంతో, చుట్టుపక్కల వెతకగా ఇంటికి సమీపంలో ఉన్న బావిలో ఆమె మృతదేహం కనిపించిందనీ తెలిపారు.