నంద్యాల అర్బన్: మహానంది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు, స్వామివారి దర్శనానికి రెండు గంటల సమయం
Nandyal Urban, Nandyal | Jun 5, 2026
నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రం అశేష భక్త జనవాహినితో పోటెత్తింది. స్వామివార్ల దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. పాఠశాలలకు సెలవు దినాలు ముగుస్తుండటంతో పలు రాష్ట్రాల నుంచి భక్తులు శుక్రవారం వేలాదిగా వచ్చారు. ఆలయంలోని పుష్కరిణిలలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరి సమేత మహానందిశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. భక్తులతో క్షేత్ర పరిసర ప్రాంతాలు క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి.