ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రామేశ్వరం జ్యోతిర్లింగాన్ని దర్శించారు.
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కుటుంబ సమేతంగా ప్రఖ్యాతిగాంచిన రామేశ్వరంలోని రామనాథం జ్యోతిర్లింగాన్ని సోమవారం దర్శించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా సోమవారం కేతిరెడ్డి కుటుంబ సమేతంగా రామేశ్వరం వెళ్లి జ్యోతిర్లింగాన్ని దర్శించారు. కొద్దిరోజుల క్రితం ధర్మవరంలో కేతిరెడ్డి 3.0 చూపిస్తానని హీట్ పెంచి ప్రస్తుతం రెండవ కోణమైన భక్తి మార్గంలో పయనిస్తున్నాడు.