అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈగల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం
అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈగల్ డిపార్ట్మెంట్ విజయవాడ హెడ్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భరత్ కుమార్ నాయక్ అధ్యక్షత వహించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా డ్రగ్స్ రహిత సమాజాన్ని స్థాపించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈగల్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ కె. రాంబాబు మాట్లాడుతూ యువత డ్రగ్స్ బారిన పడటం వలన తమ భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా సమాజానికి కూడా నష్టాన్ని కలిగించేవారుగా ఉంటున్నారని అన్నారు.