అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామంలో ఒక షాపు వద్ద గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించామని ఎస్సై రమేష్ తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు దీనికి సంబంధించిన వివరాలు తెలిపారు. షాపు వద్ద మృతదేహం ఉందని సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించామని తెలిపారు. మృతి చెందిన వ్యక్తి 55 నుంచి 60 సంవత్సరాలు ఉంటాయని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతూరు ఏరియా హాస్పిటల్ కి తరలించామని చెప్పారు. మృతదేహానికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే పోలీసులు వద్దకు రావాలని తెలిపారు.