అనంతపురం జిల్లా తరిమెల లో గొర్రెల కాపరి మహిళపై దూసుకు వచ్చిన ద్విచక్ర వాహనం మహిళకు గాయాలు
Anantapur Urban, Anantapur | May 10, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని సింగనమల మండలం తరిమెల గ్రామంలో గొర్రెలు కాస్తున్న ఓబులమ్మ అనే మహిళపై ద్విచక్ర వాహనం దూసుకు రావడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం ఆదివారం రాత్రి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.