నందికోట్కూరు: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం పొంచి ఉన్న ప్రమాదం కుమ్మరి వీధి సందులో మంటలు రేపిన కరెంటు తీగలు
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని కుమ్మరి వీధిలో ట్యాంకు పక్కన ఉన్న ఇరుకు సందులో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు కాలనీవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి,ఒక వీధి నుంచి మరో వీధికి మీటరు వెడల్పు గల చిన్న సందులో విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా కరెంటు సరఫరా తీసుకెళ్లారు. తీగలు ఒకదానికొకటి తగులుకొని పలుమార్లు మంటలు చెలరేగి తెగిపోయాయి, ఆదివారం భారీ మంటలు చెలరేగి తీగలు తెగి రహదారిపై పడ్డాయి, మీటరు వెడల్పు మాత్రమే ఉన్న ఈ సందులో నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. తీగలు తెగి పడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.