వికారాబాద్: గత ప్రభుత్వం వికారాబాద్ జిల్లా లో చేసిన అభివృద్ధి ఏమీ లేదు - కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
వికారాబాద్ జిల్లాను చూస్తుంటే గత ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందో కనిపిస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో అనంతగిరి రిసార్ట్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బిజెపి తలపెట్టిన విజయ సంకల్ప యాత్రను వికారాబాద్ జిల్లాలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండవిశ్వశ్వర్ రెడ్డి,బిజెపి జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి పాల్గొన్నారు.