విశ్వసనీయ సమాచార మేరకు ధర్మవరం లక్ష్మీ చెన్నకేశపురంలో పోలీసుల విస్తృత తనిఖీలు.
ధర్మవరం పట్టణం లక్ష్మీ చెన్నకేశ పురంలో బుధవారం సాయంత్రం వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తన ఆ సిబ్బందితో కలిసి పాత నేరస్థులు రౌడీ షీటర్లు అనుమానితుల ఇళ్లల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించినట్లు సీఐ తెలిపారు. వార్డులో ప్రశాంతంగా ఉండాలని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సిఐ హెచ్చరించారు