అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో గురువారం నాలుగు గంటల 15 నిమిషాల సమయంలో రిజిస్టర్ రమేష్ బాబుకు ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఎస్కే యూనివర్సిటీ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ ఎస్కే యూనివర్సిటీలో పదవి విరమణ అనంతరం రెండేళ్లు గడువు తర్వాత పిహెచ్డి డిగ్రీలు ప్రదానం చేయడానికి అధ్యాపకు అనర్హులుగా ఉంటారని ఇలాంటివారు పిహెచ్డి పట్టాలు ఇవ్వకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ యూనివర్సిటీ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నేతలతో పాల్గొన్నారు.