తాడేపల్లిగూడెం: రూ.25 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ లను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు రాజేష్
అడిగినవారికి కాదనకుండా ప్రజాసేవ ధ్యేయంగా జనసేన అధ్యక్షులు, ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తలపెట్టిన లక్ష్యసాధన దిశగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రయాణం చేస్తున్నారని వారి తనియులు బొలిశెట్టి రాజేష్ అన్నారు. తాడేపల్లిగూడెం ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం సీఎం సహాయనిధి చెక్కులు బొలిశెట్టి రాజేష్ చేతుల మీదగా పంపిణీ కార్యక్రమం జరిగింది.