బనగానపల్లె: బనగానపల్లెలో చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బిసి రాజారెడ్డి
బనగానపల్లెలో టీడీపీ నాయకుడు అహమ్మద్ హుస్సేన్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి ప్రారంభించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న తరుణంలో బాటసారులు, వాహనదారులకు ఇలాంటి మంచినీటి కేంద్రాలు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.