రాయచోటిలో రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు
రాయచోటిలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి రోడ్డులోని వైన్‌షాప్ ఎదురుగా మద్యం మత్తులో ఆటో బైక్‌ను ఢీకొనడంతో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.ప్రమాద సమయంలో కురుస్తున్న వర్షం, రక్తస్రావంతో యువకుడు పడిపోవడం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. వెంటనే క్షతగాత్రుడిని స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.అయితే గాయపడిన యువకుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు