అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలో గురువారం జరిగిన మహిళా శాంతి హత్య కేసులో ముగ్గురి పై కేసు నమోదు చేశామని సీఐ మహానంది, బెళుగుప్ప ఎస్ ఐ శివ విలేకరుల సమావేశంలో శుక్రవారం పేర్కొన్నారు. భార్యశాంతిని భర్తఆంజనేయులు అనుమానం తో అతి కిరతకంగా కొడవలితో నరకి పోలీసులు కు లొంగిపోయిన ఘటన లో మృతిరాలి తమ్ముడు హరి పిర్యాదుమేరకు 1.ఆంజినేయులును మొదటి ముద్దయిగాను, మృతురాలు శాంతిని కొన్నినెలలుగా వెంటబడి వేధించిన 2.తిప్పేస్వామి రెండవ ముద్దాయి, ఘటనను ప్రేరేపించిన 3.జయసింహా మూడవ ముద్దాయి గా వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.