మైదుకూరు: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక శిబిరంలో భాగంగా ఇందిరమ్మ కాలనీలో ఋతుపరమైన వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పి.వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్, టైఫాయిడ్ వంటి వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయని, ఇవి దోమల ద్వారా సంక్రమిస్తాయని తెలిపారు. ప్రజలు శుభ్రత పాటించి, దోమల పెరుగుదల నివారించాలన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.