బనగానపల్లె: బెలుం సింగవరంలో గాలివాన బీభత్సం
కొలిమిగుండ్ల మండలం బెలుం సింగవరంలో గురువారం రాత్రి కురిసిన భారీ గాలివానకు విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడి రాకపోకలకు, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. స్థానికులు, విద్యుత్ సిబ్బంది వెంటనే స్పందించి రోడ్డుపై పడిన చెట్లను తొలగించి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. కాగా, ఈ అకాల వర్షం వల్ల పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.