హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై బాటసింగారం వద్ద మంగళవారం లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంతో మెట్ నుంచి బాటసింగారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పండుగల సందర్భంగా ప్రయాణికులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కడంతో పాటు ప్రమాదం జరగడం వల్ల వాహనాల రాకపోకలు పూర్తిగా స్థంభించాయి. ట్రాఫిక్ జామ్ ప్రభావం హయత్‌నగర్ వరకు కొనసాగే అవకాశం ఉందని, సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్రేన్ సాయంతో బోల్తా పడిన లారీని పక్కకు తొలగించే చర్యలు చేపట్టారు. వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు.