కనిగిరి: నియోజకవర్గంలోని పెదచెర్లోపల్లి, పామూరు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
కనిగిరి నియోజకవర్గం లోని పెద చెర్లోపల్లి, పామూరు పోలీస్ స్టేషన్లను ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని రికార్డులు పరిశీలించి, పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.... సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మెరుగైన పోలీసింగ్ చేయాలని ఆదేశించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారికి నమ్మకం కలిగించే లాగా ఉత్తమ సేవలు అందించాలన్నారు చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై గట్టి నిఘా కొనసాగించాలన్నారు .