యాగంటిలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రత్యేక పూజలు
బనగానపల్లె: కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు రామిరెడ్డితో కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేయించారు. అనంతరం యాగంటి బసవన్న గోశాలను సందర్శించి, గోవుల సంరక్షణ తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు.