ఉరవకొండ: పెన్నహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైభవంగా శ్రీవారి పల్లకి ఉత్సవం
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నందు స్వామివారికి శనివారం ఉదయం నుండి ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలను వేద పండితులు నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ మూర్తులను పల్లకిలో ఉంచి ఆలయ పురవీధుల్లో పల్లకి సేవలు నిర్వహించారు. స్వామివారి పల్లకి సేవ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.