ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సోమవారం స్థానిక పోలీసులు దీపావళి ముందు సామాగ్రి విక్రయిస్తున్న దుకాణాలు మరియు గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా దీపావళి మందు సామాగ్రి విక్రయించడం లేదా నిల్వ ఉంచడం చట్టరీత్య నేరమని హెచ్చరించారు. అంతేకాకుండా దీపావళి ముందు సామాగ్రి తయారు చేసే గోదాములను పరిశీలించి అగ్నిప్రమాదాలు జరిగేటప్పుడు ఉపయోగించే రక్షణ పరికరాలు ఉన్నాయా లేదా అని పోలీసులు పరిశీలించి హెచ్చరించారు. రాష్ట్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 20 మందికి పైగా మృతి చెందిన విషయాన్ని దుకాణదారులకు పోలీసులు వెల్లడించారు.