గాజులపల్లి లో విద్యార్థులకు' గుడ్ టచ్- బాడ్ టచ్ " పై అవగాహన కల్పించిన నంద్యాల శక్తి టీం సభ్యులు
Nandyal Urban, Nandyal | Apr 2, 2026
నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లె ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్పె అవగాహన కల్పించారు. నంద్యాల శక్తి టీం సభ్యులు గురువారం విద్యార్థులతో మాట్లాడారు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బయట వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలో వివరించారు. ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు తమ రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను శక్తి టీం నుంచి తెలుసుకున్నారు.