ఖైరతాబాద్: జీతాలు పెంచాలంటూ డిఆర్ఎఫ్ సిబ్బంది హైడ్రా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన
పెండింగ్ జీతాలు ఇవ్వాలని ఒకరు.. జీతాలు కట్ చేయొద్దని మరొకరు ధర్నా నిర్వహిస్తున్నారు. గత 6 నెలలుగా జీతాలు వందకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నామంటూ ధర్నాకు దిగగా.. ఈరోజు DRF సిబ్బంది ఆందోళన బాటపట్టారు. తగ్గించిన జీతాలను పెంచాలంటూ హైడ్రా PS ముందు సిబ్బంది ధర్నా చేపట్టారు. కాగా, ఈ ధర్నాతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.