ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిగాంచిన కదిరి క్షేత్రంలో ఈనెల 22న గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కదిరి లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఈనెల 22న ఈ గిరి ప్రదక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని భక్తాదులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.