ఆళ్లగడ్డ: పాలసాగరం గ్రామంలోని వక్కిలేరు నది పరివాహక ప్రాంతాల్లో తహశీల్దార్ జ్యోతి రత్నకుమారి
వక్కిలేరు నదీ ప్రాంతాల్లో ఆళ్లగడ్డ తహశీల్దార్ జ్యోతి రత్నకుమారి బుధవారం పర్యటించారు. రెండురోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వక్కిలేరు పరివాహక ప్రాంతమైన పాలసాగరం గ్రామంలో ఆమె పర్యటించారు. ఇంకా రెండు రోజులు వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఏదైనా సహాయం కావాలంటే వీఆస్ఏ, వీఆర్వో, తదితరల అధికారులు అందుబాటులో ఉంటారని ఆమె పేర్కొన్నారు.