అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని మదిగుబ్బలో నీటిలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
Anantapur Urban, Anantapur | Apr 24, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం మదిగుబ్బ సమీపంలో ఉన్న నీటిలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుందని పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం వెల్లడించారు. గత రెండు రోజుల క్రితం చేపలను పట్టేందుకు మదిగుబ్బ సమీపంలో ఉన్న నీటి ప్రవాహం వద్దకు వెళ్లి అందులో పడి మృతి చెందినట్లుగా వారు తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.