హయత్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికులతో కండక్టర్ అసభ్య పదజాలంతో దూషించిన ఘటన గురువారం తీవ్ర కలకలం రేపుతోంది. హయత్నగర్ డిపో పరిధిలో నడుస్తున్న TG01T5653 నంబర్ గల 218H రూట్ బస్సులో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలను కండక్టర్ ఇష్టారీతిన బూతులు తిడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు, ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల పట్ల ఇలాంటి అమానవీయ ప్రవర్తన ఏమాత్రం సహించరాదని, సంబంధిత కండక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.