ఎన్నికలలో మీడియాకు కీలకమైన బాధ్యత ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా స్థాయి బ్యూరో జర్నలిస్టులకు గురువారం స్థానిక కలెక్టరేట్ లోని స్పందన సమావేశ మందిరంలో వర్క్ షాప్ నిర్వహించారు. ఎల్ ఈ డి ప్రొజెక్టర్ ద్వారా మీడియా వారికి అవగాహన కల్పించారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు కల్పించడమే ఎన్నికల కమిషన్ ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ చెప్పారు. పారదర్శకతతో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి మీడియా తమ వంతు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.