రాజేంద్రనగర్: చేవెళ్లలో రోడ్డు ప్రమాదం బాధాకరం: కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి భీమ్ భరత్
చేవెళ్లలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి భీమ్ భరత్ అన్నారు. ఈ రోజు పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాయకులు తదితరులు పాల్గొన్నారు.