జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందనని శనివారం కలిశారు. తార్నాకలోని విజయ డెయిరీ కార్పొరేషన్ ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమస్యపై వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం ఉంటున్న భవనానికి గడువు పొడిగించాలని అదేవిధంగా శాశ్వత భవనానికి భూమి కేటాయించాలని కోరారు. స్థానికంగా ఎంతో మంది పేద పిల్లలు పాఠశాలలో చదువుకుంటున్నారని పేర్కొన్నారు