శ్రీశైలంలో స్వామివారిని స్పర్శ దర్శనం 500 టికెట్ తో దర్శనం చేసుకున్న భక్తులకు ఇకనుంచి 100 గ్రాముల 2లడ్డులు ఉచితంగా ఇస్తామని పాలకమందిలో సభ్యులు నిర్ణయం తీసుకున్నారు, నేడు బుధవారం సాయంత్రం శ్రీశైలంలో పాలకమండలి సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు అధ్యక్షతన పాలకమండ సభ్యులు పాల్గొన్నారు ,ఈ సమావేశంలో 14 అంశాలు చర్చకు రాగ 11 అంశాలు ఆమోదం పొందాయని రెండు వాయిదా పడ్డాయని, ఒకటి తిరస్కరించబడ్డాయని చైర్మన్ రమేష్ నాయుడు తెలియజేశారు ,అలాగే కొలనుభారతి క్షేత్రాన్ని శ్రీశైలం దేవస్థానం దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తుందని చైర్మన్ అన్నారు,