డోన్: డోన్ నియోజకవర్గంలో పెట్రోల్ డీజిల్ క్యాన్ లతో క్యూ
Dhone, Nandyal | Apr 26, 2026 నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం లో కొనసాగుతున్న పెట్రోల్ డీజిల్ కొరత.. ఆదివారం డోను, ప్యాపిలి బేతంచెర్లలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, అన్ని పెట్రోల్ బంకుల్లో కావాల్సినంత ఇంధనం అందుబాటులో ఉందని అధికారులు హామీ ఇచ్చినా వినియోగదారులలో మాత్రం ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. పెట్రోల్ బంకులలోనూ వాహనదారులకు డీజిల్, పెట్రోల్ వేస్తున్నారు. అయితే దొరకకుండా పోతుందేమోనని వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడంతో పాటు క్యాన్లు, డ్రమ్ములతో పట్టుకునేందుకు క్యూ కట్టారు.