నంద్యాల అర్బన్: పచ్చదనంతో చూపర్లను ఆకట్టుకుంటున్న నల్లమల అడవి అందాలు
Nandyal Urban, Nandyal | Jun 11, 2026
నంద్యాల - గిద్దలూరు జాతీయ రహదారిలోని నల్లమల్ల అడవి ప్రాంతం ఇటీవల కురిసిన వర్షాలకు సరికొత్త శోభను సంతరించుకుంది. మొన్నటివరకు ఎండ తీవ్రతకు ఆకులు రాలి, ఎండిపోయినట్లు కనిపించిన అడవి.. ఇప్పుడు నిండు పచ్చదనంతో కళకళలాడుతోంది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, ప్రయాణికులకు ఈ ప్రకృతి దృశ్యాలు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. రహదారి గుండా వెళ్లేవారు నల్లమల్ల అడవి అందాలను ఆస్వాదిస్తూ సే