రామకుప్పం మండలంలోని ననియాల ఎలిఫెంట్ క్యాంప్లోని 2 ఏనుగులు జయంత్, వినాయక్కు కుప్పంకు చెందిన అడ్వకేట్ నరేంద్ర ఆజాద్ వారానికి సరిపడా ఆహారం అందజేశారు. ఏనుగుల శ్రేయస్సుకు, గ్రామాల భద్రతకు, అడవుల సమతుల్యానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని నరేంద్ర పేర్కొన్నారు. అడవి ఏనుగుల నుంచి వ్యవసాయ పంటలు, ప్రజలను కాపాడేందుకు జయంత్, వినాయక్ నిరంతరం కృషి చేస్తుందన్నారు.