పాపన్నపేట్: ఏడుపాయల క్షేత్రంలో ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు: రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారి దర్శనం
పాపన్నపేట ఏడుపాయల వనదుర్గా భవాని మాత క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు రాజరాజేశ్వరి సహిత వనదుర్గాదేవిగా అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు.