నిజామాబాద్ సౌత్: నగరంలో రాష్ట్ర ప్రభుత్వా దిష్టిబొమ్మ దగ్ధం చేసిన అంగన్వాడీలు, అడ్డుకున్న పోలీసులు
అంగన్వాడీ కార్మికులను సోమవారం అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం నిజామాబాద్ నగరంలో CITU ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా, పోలీసులు దీనిని అడ్డుకోవడంతో తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు దిష్టి బొమ్మను దహనం చేశారు. ప్రజాపాలన అంటే..? నిర్బంధాలా?, కార్మికుల సమస్యలను పరిష్కరించమంటే అక్రమ అరెస్టులా? అని నినదించారు.