కనిగిరి: వెనుకబడ్డ కనిగిరి ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు: కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
పెద చెర్లోపల్లి: వెనుకబడిన కనిగిరి ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. పెద్ద చెర్లోపల్లి మండలంలోని లింగన్నపాలెంలో ఆదివారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈనెల 11వ తేదీన లింగన్నపాలెంలో ఎం ఎస్ ఎం ఈ పార్కు ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. దీనితోపాటు రాష్ట్రంలోని మరో 50 ఎం ఎస్ ఎం ఈ పార్కులకు సీఎం వర్చువల్ గా ప్రారంభిస్తారు అన్నారు. కనిగిరి ప్రాంతంలో పరిశ్రమలను స్థాపించి, ఉపాధి కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.