డోన్: అమావాస్య సందర్భంగా బేతంచెర్ల లో అమ్మవారికి సామూహిక నామ పారాయణం
Dhone, Nandyal | Apr 17, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల పూదోట ఆశ్రమంలో అఖండ సామూహిక లలితా సహస్రనామ పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చైత్రమాస అమావాస్య పురస్కరించుకుని భక్తులు అమ్మవారి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చి పూజలు చేశారు. లలితా ఉపాసకులు శ్రీదేవి పారాయణం విశిష్టతను వివరించారు. వివిధ గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.