నంద్యాల అర్బన్: నంద్యాలలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు, బెంబేలెత్తుతున్న ప్రజలు
Nandyal Urban, Nandyal | Apr 25, 2026
నంద్యాల జిల్లాలో ఎండలు మండుతున్నాయి. జిల్లా కేంద్రం నంద్యాలలో శనివారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 10 రోజుల నుంచి జిల్లాలో ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా ఉంది. చిన్నారులు, తల్లులతో పాటు వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు బయటకు రాకుండా, వడదెబ్బ సోకకుండా మంచినీరు ఎక్కువగా తాగుతూ ఉండాలని కోరారు.