ఒంగోలు అర్బన్: ఒంగోలు రూరల్ సెక్షన్ పరిధిలో జరుగుతున్న సోలార్ ప్యానెల్స్ ఏర్పాటును పరిశీలించిన ఏపీ సి పి డి సి ఎల్ డైరెక్టర్ మూర్తి
Ongole Urban, Prakasam | May 26, 2026
ఎస్సీ/ఎస్టీ రూఫ్‌టాప్ సోలార్ పథకం కింద ఒంగోలు రూరల్ సెక్షన్ పరిధిలోని త్రోవగుంట గ్రామంలో జరుగుతున్న సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు పనులను ఏపీసీపీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్)టీవీఎస్ఎన్ మూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పనుల పురోగతిని సమీక్షించి, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటును నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పనులు వేగవంతంగా కొనసాగించాలని ఆదేశించారు.అలాగే విద్యుత్ భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ, ప్రతి దశలో సాంకేతిక నిబంధనలు అమలు చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు తెలిపా