కడప: ఆకాంక్షిత జిల్లాల ప్రగతిలో జిల్లా మరింత పురోగతి సాధించేందుకు సమిష్టి కృషితో ముందుకు వెళ్లాలి: నీతి అయోగ్ సెక్రెటరీ
Kadapa, YSR | Oct 29, 2025 ఆకాంక్షిత జిల్లాల ప్రగతిలో వైయస్సార్ కడప జిల్లా మరింత పురోగతి సాధించేందుకు సమిష్టి కృషితో ముందుకు వెళ్లాలని నీతి ఆయోగ్ సెక్రెటరీ జాయింట్ సెక్రెటరీ మరియు ఆకాంక్షిత జిల్లా ప్రాబరి అధికారి సిద్ధార్థ జైన్ పేర్కొన్నారు.బుధవారం జిల్లా సచివాలయంలోని బోర్డ్ రూమ్ నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తో కలిసి వై ఎస్ ఆర్ కడప ఆకాంక్షిత జిల్లా మరియు ఆకాంక్షిత బ్లాక్ ప్రోగ్రాం ప్రగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ సెక్రెటరీ మాట్లాడుతూ.. 2025 మార్చి నాటికి 73.6 స్కోరు సాధించి టాప్ 5 జిల్లాలలో వైయస్సార్ కడప జిల్లా నిలిచిందని తెలిపారు.